సువార్త సందేశం
– దయచేసి క్రింది భాగాన్ని చదవండి:
ఆది 1:1 | ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. |
రోమా 3:23 | అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. |
యోహాను 8:34 | అందుకు యేసు, “పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను”. |
దేవుడు మనలను సృజించెను కానీ మనము ఆయనను ఎరుగము. మన పాపపు స్వభావము వలన మనము ఆయన నుండి వేరుపరచబడ్డాము. దేవుడు లేని మన జీవితాలకు అర్థము లేదు, ఉద్ధేశమూ లేదు. మన పాపము యొక్క పర్యవసానము (వెచ్చించవలసింది) మరణము, శారీరక మరియు ఆత్మీయ. ఆత్మీయ మరణమంటే దేవునితో వేరుపరచబడటం. శారీరక మరణమంటే శరీరము కుళ్ళిపోవటం. మన పాపములోనే మనం మరణిస్తే దేవునితో నిత్యత్త్వంగా వేరుపరచబడి నరకానికి చేరుతాము. మన పాపములనుండి మనల్ని మనం ఎలా రక్షించుకొని దేవుని దగ్గరకు తిరిగిరాగలం? మనల్ని మనం రక్షించుకోలేము ఎందుకంటే ఒక పాపి తన్ను తాను రక్షించుకోవటం సాధ్యం కాదు (నీట మునిగేవాడు తన్ను తాను రక్షించుకోలేని విధంగా). అదే విధంగా ఇతరులు మనల్ని రక్షించలేరు. ఎందుకంటే మనమందరము పాపులమే (నీట మునిగేవాడు వేరొకడిని రక్షించలేడు. ఇద్దరికి సహాయమవసరమే). మన పాపములనుండి మనల్ని రక్షించడానికి పాపము లేని ఒకడు మనకవసరం (మునిగిపోనివాడు). ఒక పాపరహితుడు మాత్రమే మనల్ని రక్షించగలడు. అందరు పాపము చేసినవారే గనుక ఈ పాపపు లోకంలో ఒక పాపరహితుడ్ని కనుగొనటం ఎలా?
రోమా 6:23 | ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము. |
యోహాను 3:16 | దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు అనుగ్రహించెను. |
మత్తయి 1:23 | “ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు” దీనిని అనువదిస్తే “దేవుడు మనతో.” |
యోహాను 8:23 | అప్పుడాయన “మీరు క్రిందివారు, నేను పైనుండువాడను; మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోకసంబంధుడను కాను. |
మార్కు 1:11 | మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్ధము ఆకాశమునుండి వచ్చెను. |
యోహాను 8:36 | కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులైయుందురు. |
యోహాను 3:3 | అందుకు యేసు అతనితో “ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.” |
యోహాను 1:12 | తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. |
మనల్ని సృజించి మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు మనకొక పరిష్కారం అనుగ్రహించెను. ఆయనకు మన యెడలున్న అత్యంత ప్రేమనుబట్టి మన పాపముల కొరకు మరణించుటకు తన స్వకీయ కుమారుడైన యేసును పంపెను. యేసు ఈ లోక సంబంధి కాదు కనుక ఆయన పాపరహితుడు. ఈ భూమి మీదున్నపుడు ఆయన్ని పాపము చేయటానికి శోధించిన సైతానును అధిగమించెను. ఆయన జీవితం పరలోకమందున్న దేవునిని సంతోషపరచెను. ఆయన మన పాపములను భరియించి మన పాపములకొరకు శిలువ మీద మరణించెను. మన జీవితాలకు ఆయన రక్షకుడు (యేసు మునుగుటలేదు గనుక మనల్ని రక్షించగలిగెను). మన పాపముల కొరకు వ్యయం చెల్లించడమే యేసు శిలువ మరణ ఉద్దేశ్యం. దాని వలన మన పాపములను మనకు దూరపరచి దేవునితో తెగిన సంబంధాన్ని పునరుద్ధరించటము. దేవుని శక్తి ద్వారా ఆత్మీయ మరణమునుండి (దేవునితో ఎడబాటు) మనము బ్రతుకుతాము. ఈ నూతన సంబంధమే తిరిగి జన్మించుట. మన సృష్టికి, జీవితము యొక్క ఉద్ధేశాన్ని పునరుద్ధరించి మన జీవితానికి నిజమైన అర్థాన్ని ఉద్ధేశాన్ని ఇస్తుంది.
యోహాను 11:25 | అందుకు యేసు, “పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. |
రోమా 6:9 | …, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి… |
అపొ 2:24 | మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను. |
రోమా 14:9 | తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రతికెను. |
అపొ 1:11 | “గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లట చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చున”ని వారితో చెప్పిరి. |
యేసు మన పాపముల నిమిత్తము మరణించుటవలన చేసిన త్యాగాన్ని పరలోకమందున్న దేవుడు స్వీకరించాడనటానికి నిదర్శనమేమిటి? దేవుడు యేసుక్రీస్తును మరణమునుండి లేపటమే దీనికి నిదర్శనం. పునరుద్ధానము వలన యేసుక్రీస్తు మరణాన్ని జయించాడని నిరూపింపబడింది (లేదా వేరే మాటలలో మరణానికి ఆయన మీద ఎటువంటి శక్తి లేదు). ఇప్పుడు యేసు జీవించి యున్నాడు గనుక మనము కూడా ఆయనతోపాటు జీవించియన్నాము. ఆయన జీవము మనకు కూడా జీవాన్నిస్తుంది. ఇంకనూ ఆయన పునరుద్ధానుడై ఈ దినం జీవించేయున్నాడు.
యోహాను 5:24 | “నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. |
యోహాను 10:9 | నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటకు వచ్చుచు మేత మేయుచునుండును. |
యోహాను 14:6 | యేసు, “నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రియొద్దకు రాడు. ” |
యోహాను 8:24 | కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని వారితో చెప్పెను. |
అపొ 4:12 | మరి ఎవనివలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. |
రోమా 10:13 | ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును. |
రోమా 10:11 | ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. |
రోమా 2:11 | దేవునికి పక్షపాతము లేదు. |
రోమా 3:22 | అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్మువారందరికి కలుగు దేవుని నీతియైయున్నది. ఏ భేదమును లేదు. |
రోమా 10:9 | యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల, నీవు రక్షింపబడుదువు. |
ఎలా మన పాపములను తీసివేసుకొని మనం ఈ కొత్త జీవితాన్ని పొందగలం? యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా నమ్ముట ద్వారానే. మన పాపపు మార్గమును గూర్చి పశ్యాతాపము చెంది యేసుక్రీస్తును క్షమించమనీ రక్షించమనీ అడగితే ఆయన మనల్ని రక్షిస్తాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆయన మన పాపముల నిమిత్తము చనిపోవటానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ భూమీదున్న ఎవరైనా ఆయనయందు విశ్వాసముంచితే దేవుని క్షమాపణ పొందుకుని, వారి పాపములనుండి (పాతాళము నుండి), రక్షింపబడి దేవునినుండి ఒక కొత్త జీవితాన్ని పొందుకుంటారు. దేవుడు పక్షపాతి కాదు. ఆయన దేని వలనైనను ప్రభావితం చెందడు. మనం నివసించే దేశం, మనం మాట్లాడే భాష, ధనిక లేదా పేద, ఆడ లేదా మగా, యవనస్థుడు లేదా ముదుసలి, లేదా ఎటువంటి శారీరక వ్యత్యాసాలు ఆయనను ప్రభావితం చేయలేవు. ఎవరైనా యేసుయందు విశ్వాసముంచి ఆయనను క్షమించమని అడిగితే వాళ్లు రక్షింపబడతారు. మీరు యేసుక్రీస్తును వెంబడించాలని నిర్ణయించుకుంటే ఈ క్రంది ప్రార్ధనను ప్రార్ధించండి:
పరలోకమందున్న తండ్రి, మా పాపముల కొరకు మరణించటానికీ, దాని ద్వారా మేము రక్షింపబడి కొత్త జీవితము పొందు నిమిత్తము మీ ఒక్కగానొక కుమారుడైన యేసుక్రీస్తును పరలోకమునుండి పంపినందుకు మీకు వందనాలు. నా పాపముల బట్టి నేను పశ్చాతాపపడి మీ క్షమాపణను వేడుకుంటున్నాను. నేను యేసుక్రీస్తుయందు విశ్వాసముంచి ఆయనను నా స్వంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. నీవు అనుగ్రహించిన ఈ నూతన జీవితము నీకు ఇష్టముగా ఉండులాగునా నన్ను నడిపించి నాకు సహాయము చేయుము. ఆమెన్.
మీరు పైవిధంగా ప్రార్ధిస్తే మీరు వెల్లడానికి మీకొక చర్చిని చూపించమని దేవునిని అడగండి. దేవునితో క్రమంమగా ప్రార్ధన ద్వారా మాట్లడండి. దేవుడు మీతో మాట్లాడతారు. దేవుని స్వరాన్ని వినండి. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుక ఆయన మిమ్మల్ని సంరక్షిస్తాడు. మీరు ఆయనను నమ్మవచ్చు. ఆయనను నమ్మినవారెవరూ ఓడిపోలేదు. దేవుడు మంచి దేవుడు. ఆయన నమ్మదగినవాడు. మీ జీవితాన్ని గూర్చి ఆయన మీద ఆధారపడవచ్చు. ఆయన యొద్దకు మీ అవసరాలను తీసుకుని రండి. ఆయన మీ గూర్చి చింతించువాడు. మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు చెప్పాడు, ‘నిన్ను ఎన్నడును విడువను, నిన్ను ఎడబాయను’. ఆయనయందు విశ్వాసముంచండి. యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదము పొందండి.
బైబిలును యోహానునుండి మొదలుపెట్టి క్రమంగా చదవండి. అధిక ఇంటర్నెట్ సమాచారం కొరకు ఇక్కడ క్లక్ చేయండి.